• Home »
  • Other Channels »
  • టీవీ5 బిజినెస్ న్యూస్ చానల్ టీవీ5 మనీ టెస్ట్ సిగ్నల్ ప్రారంభం, 3నుంచి ప్రసారాలు

టీవీ5 బిజినెస్ న్యూస్ చానల్ టీవీ5 మనీ టెస్ట్ సిగ్నల్ ప్రారంభం, 3నుంచి ప్రసారాలు

టీవీ5 న్యూస్ చానల్ ఆధ్వర్యంలో టీవీ 5 మనీ పేరుతో ఒక బిజినెస్ న్యూస్ చానల్ రూపుదిద్దుకుంది. ఈ రోజు టెస్ట్ సిగ్నల్ ప్రారంభించగా ఆగస్టు 3 నుంచి పూర్తి స్థాయి ప్రసారాలు అందుతాయి. అయితే ఇది యు ట్యూబ్ చానల్ గా, వెబ్ సైట్ గా, యాప్ గా అందుబాటులోకి రావటంతోబాటు ఐపిటీవీ వేదిక మీద కూడా ప్రసారమవుతుందే తప్ప ప్రస్తుతానికి చానల్ కాదు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలు ఇందులో ప్రధానంగా ప్రసారమవుతాయి.

స్టాక్ మార్కెట్ల సమాచారం, వాణిజ్య వార్తలు, కమొడిటీస్ ధోరణులు, లైఫ్ స్టైల్ ట్రెండ్స్ ఇవ్వటం ద్వారా పెట్టుబడులమీద ఇన్వెస్టర్లకు మెరుగైన అవగాహన కలుగుతుందని చానల్ భావిస్తోంది. టీవీ 5 లో బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమానికి మంచి స్పందన రావటం వల్లనే ప్రత్యేకంగా బిజినెస్ చానల్ ప్రారంభింనచిట్టు యాజమాన్యం వెల్లడించింది.