• Home »
  • BARC »
  • రెండు రాష్ట్రాల్లో టీవీ9, హైదరాబాద్ లో ఎన్టీవీ

రెండు రాష్ట్రాల్లో టీవీ9, హైదరాబాద్ లో ఎన్టీవీ

బ్రాడ్ కాస్ట్ అడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) 2016 లో నాలుగోవారానికి (జనవరి 23-29 మధ్య కాలానికి ) అందించిన సమాచారం ప్రకారం రెండు తెలుగురాష్ట్రాలలో కలిపి టీవీ 9 మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ లో ఎన్టీవీ ముందుంది. గ్రామీణ ప్రాంతంలోనూ టీవీ9 నంబర్ వన్ గానే ఉంది. 15 సంవత్సరాలు పైబడిన ప్రేక్షకుల ఆదరణ ఆధారంగా బార్క్ ఈ సమాచారం రూపొందించింది.

రెండు రాష్ట్రాలలో కలిపి చూసినప్పుడు పోటీ ప్రధానంగా టీవీ9, టీవీ5, ఎన్టీవీ మధ్యనే కేంద్రీకృతమైంది. హైదరాబాద్ విషయానికొస్తే ఈటీవీ ఆంధ్రప్రదేశ్, వి6 న్యూస్ చానల్స్  టీవీ9 కంటే ముందుండి గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈ ఐదింటితోబాటు టి న్యూస్ ఒకమోస్తరుగా ఉండగా మిగిలినవన్నీ హైదరాబాద్ లో దాదాపు నామమాత్రంగానే ఉన్నాయ

చానల్ రెండు రాష్ట్రాలు  హైదరాబాద్ గ్రామీణ ప్రాంతం
టీవీ 9 134 103 116
టీవీ 5 112 129 81
ఎన్టీవీ 105 132 79
వి 6 న్యూస్ 47 125 46
ఈటీవీ ఎపి 27 120 11
ఎక్స్ ప్రెస్ టీవీ 22 38 20
సాక్షి న్యూస్ 22 13 25
టి న్యూస్ 21 62 18
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి 14 9 13
10 టీవీ 9 21 6
జెమిని న్యూస్ 8 9 8
ఈటీవీ తెలంగాణ 7 21 6
స్టుడియో ఎన్ 6 17 3
హెచ్ ఎమ్ టీవీ 4 9 2
జై తెలంగాణ 3 14 1

సివిఆర్ న్యూస్, మహా న్యూస్, ఐ న్యూస్, 6టీవీ, 6టీవీ తెలంగాణ, 99 టీవీ, నెం.1 న్యూస్, భారత్ టుడే, వై టీవీ , రాజ్ న్యూస్ తెలుగు ఇంకా బార్క్ చందాదారులుగా చేరలేదు.