• Home »
  • News »
  • రెండు రాష్ట్రాల్లో నెం.1 న్యూస్ చానల్ టీవీ9 హైదరాబాద్ లో రెండో స్థానంలో టీ న్యూస్

రెండు రాష్ట్రాల్లో నెం.1 న్యూస్ చానల్ టీవీ9 హైదరాబాద్ లో రెండో స్థానంలో టీ న్యూస్

జులై 16-22 మధ్య వారానికి తెలుగు న్యూస్ చానల్స్ లో టీవీ 9 తన తిరుగులేని నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకోవటంతోబాటు రెండో స్థానంలో ఉన్న టీవీ 5 తో ఉన్న అంతరాన్ని కూడా కొనసాగిస్తోంది. మూడో స్థానంలో ఎన్టీవీ ఉండగా నాలుగు, ఐదు స్థానాల్లో వి6 న్యూస్, 10 టీవీ నిలిచాయి. గ్రామీణ ప్రాంతాల రేటింగ్స్ లో కొన్ని చోట్ల రాంకులు తారుమారు కావటం గమనించవచ్చు. టీవీ 5 కంటే ఎన్టీవీ, వి6 న్యూస్ కంటే 10 టీవీ ఎక్కువ రేటింగ్స్ సంపాదించుకున్నాయి.

హైదరాబాద్ విషయానికొస్తే, టీవీ 9 నెంబర్ వన్ స్థానంలోనే ఉండగా టీ న్యూస్ రెండో రాంకు దక్కించుకుంది. ఎన్టీవీ కంటే టీవీ 5 వెనుకబడింది. వి6 చెప్పుకోదగిన రేటింగ్స్ తో నాలుగో స్థానంలో ఉండగా 10 టీవీ ఘోరంగా వెనుకబడింది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్ లో మెరుగైన ప్రేక్షకాదరణ నమోదైంది. బార్క్ ప్రస్తుతం చందా కట్టిన 15 తెలుగు న్యూస్ చానల్స్ రేటింగ్స్ సమాచారం అందిస్తుండగా ఇంకా  సివి ఆర్ న్యూస్, రాజ్ న్యూస్ తెలుగు, మహా న్యూస్, ఐ న్యూస్, నెం.1 న్యూస్, భారత్ టుడే, వై టీవీ, 99%, 6టీవీ, 6 టీవీ తెలంగాణ అనే 10 చానల్స్ చందా కట్టటం లేదు.

నెం. చానల్ రెండు రాష్ట్రాలు రాంకు గ్రామీణ ప్రాంతం రాంకు హైదరాబాద్ రాంకు
1 టీవీ 9 202 1 204 1 151 1
2 టీవీ 5 న్యూస్ 155 2 158 3 111 5
3 ఎన్టీవీ 144 3 163 2 125 3
4 వి 6 న్యూస్ 73 4 78 5 116 4
5 10 టీవీ 69 5 84 4 37 7
6 టి న్యూస్ 25 6 16 7 126 2
7 ఈటీవీ ఎపి 21 7 13 8 76 6
8 సాక్షి టీవీ 21 7 22 6 15 9
9 ఎబిఎన్ ఆంధ్రజ్యోతి 14 8 13 9 12 11
10 స్టుడియో ఎన్ న్యూస్ 11 9 5 10 36 8
11 ఎక్స్ ప్రెస్ టీవీ 6 10 5 10 10 12
12 హెచ్ ఎం టీవీ 5 11 4 11 12 11
13 జెమిని న్యూస్ 5 11 4 11 6 13
14 ఈటీవీ తెలంగాణ 5 11 4 11 13 10
15 జై తెలంగాణ 3 12 1 12 12 11