• Home »
  • BARC »
  • గ్రామాల్లో టీవీ9, టీవీ5 కు సమాన ఆదరణ: ఈటీవీ ఎపి కి హైదరాబాద్ ప్రేక్షకులెక్కువ

గ్రామాల్లో టీవీ9, టీవీ5 కు సమాన ఆదరణ: ఈటీవీ ఎపి కి హైదరాబాద్ ప్రేక్షకులెక్కువ

ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు సాగిన 35 వ వారానికి బార్క్ అందించిన ప్రేక్షకాదరణ లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి టీవీ9  తన నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. రెండో స్థానంలో టీవీ 5, మూడో స్థానంలో ఎన్టీవీ ఉండగా వి6 నాలుగో రాంకు, 10 టీవీ ఐదో రాంకు సంపాదించుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల రేటింగ్స్ విషయానికొస్తే టీవీ9, టీవీ5 సమాన ప్రేక్షకాదరణ పొందగలినట్టు తెలుస్తున్నది. గట్టిపోటీ ఉండే వి6, 10టీవీ చానల్స్ లో 10 టీవీకే గ్రామాల్లో ఎక్కువ ఆదరణ కనబడింది.

అదే హైదరాబాద్ నగరం విషయానికొస్తే టీవీ5 కంటే ఎక్కువ రేటింగ్స్ తో ఎన్టీవీ రెండో స్థానం దక్కించుకుంది. వి6 పెద్ద ఎత్తున రేటింగ్స్ సంపాదించుకోవటం, 10 టీవీ బాగా వెనుకబడటం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో వి6 కంటే స్వల్పంగా టి న్యూస్ ఆధిక్యం కనబరచటం కూడా రేటింగ్స్ లో చూడవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈటీవీ తెలంగాణ కంటే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కే హైదరాబాద్ ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నారు. పైగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా హైదరాబాద్ లో ఆదరణ ఉండటం కూడా విశేషం.

చానల్ గ్రామీణ ప్రాంతం రాంక్ హైదరాబాద్ రాంక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాంక్
టీవీ 9 198 1 166 1 217 1
టీవీ 5 198 1 146 3 188 2
ఎన్టీవీ 184 2 155 2 168 3
వి6 86 4 133 5 83 4
10టీవీ 100 3 37 7 75 5
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి 30 5 23 8 42 6
టి న్యూస్ 20 8 135 4 28 7
సాక్షి టీవీ 26 6 20 9 26 8
ఈటీవీ ఎపి 13 9 109 6 24 9
స్టుడియో ఎన్ 23 7 13 11 18 10
ఈటీవీ తెలంగాణ 5 10 20 9 6 11
హెచ్ ఎం టీవీ 5 10 14 10 6 12
జెమిని న్యూస్ 3 12 6 14 4 13
ఎక్స్ ప్రెస్ టీవీ 4 11 8 13 4 13
జై తెలంగాణ 2 13 11 12 2 14
ఐ న్యూస్ 1 14 4 15 2 14