• Home »
  • BARC »
  • జెమిని, ఉదయ చానల్స్ లో ఈరోజు నుంచి రెండేసి కొత్త సీరియల్స్

జెమిని, ఉదయ చానల్స్ లో ఈరోజు నుంచి రెండేసి కొత్త సీరియల్స్

నెంబర్ వన్ స్థానాలు కోల్పోయిన తెలుగు, కన్నడ మార్కెట్లలో కోలుకోవటానికి సన్ గ్రూప్ తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకప్పుడు సీరియల్స్ లో తిరుగులేని ఆదరణ పొందిన చానల్స్ ఇప్పుడు మళ్ళీ అదే సీరియల్స్ ద్వారా ప్రేక్షకాదరణ పొందాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. సాయంకాలం ప్రైమ్ టైమ్ లో తెలుగు ప్రేక్షకులకోసం జెమిని టీవీలో,  కన్నడ ప్రేక్షకుల కోసం ఉదయ టీవీలో రెండేసి సీరియల్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సాయంత్రం నుంచి ప్రసారమయ్యే సీరియల్స్ కు సన్ నెట్ వర్క్ ప్రచారం ఉధృతంగా సాగిస్తోంది.

Radha Gopalam      Todikodallu

తెలుగులో సాయంత్రం 6.30 కి తోడికోడళ్ళు, 7.00 కి రాధాగోపాలం సీరియల్స్ ప్రసారమవుతాయి. అదే విధంగా ఉదయ టీవీలో సాయంత్రం 7.30 కి అరమనె, 8.00కి సుందరి అనే సీరియల్స్ ప్రసారమవుతాయి. కీలకమైన సాయంకాలం సమయంలో రేటింగ్స్ పెంచుకోవటమే సన్ గ్రూప్ లక్ష్యంగా కనిపిస్తోంది. కన్నడ మార్కెట్ లో ఉదయ టీవీ బాగా తగ్గిపోయి ఉదయ మూవీస్ కంటే వెనుకబడిన నేపథ్యంలో ఈ మార్పు నిర్ణయం తీసుకున్నారు.

Aramane   sundari

అయితే, ఇప్పటికే ఆయా సమయాల్లో ప్రసారమయ్యే సీరియల్స్ కి అలవాటు పడిన ప్రేక్షకులు ఒక్క సారిగా అటు వైపు నుంచి ఇటు వైపు ఎలా మారతారన్నదే ప్రశ్న. ఈ కొత్త సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే నిజంగా అదొక అద్భుత విజయమే అవుతుంది. ఏ స్థాయిలో ప్రచారం చేయటం ద్వారా ఇటువైపు ఆకర్షించగలుగుతారో చూడాలి.