• Home »
  • Top Stories »
  • జీ తెలుగులో రెండు కొత్త సీరియల్స్

జీ తెలుగులో రెండు కొత్త సీరియల్స్

పదో వార్షికోత్సవం నాటికల్లా తెలుగు చానల్స్ లో నెంబర్ వన్ స్థానానికి ఎదిగిన జీ తెలుగు ఇప్పుడు రెండు సరికొత్త సీరియల్స్ ప్రసారం చేయటానికి రంగం సిద్ధం చేసుకుంది. వాటి ప్రసార తేదీలు ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ అన్నపూర్ణ స్టుడియోస్ వారి ’ గీతాంజలి ’ త్వరలోనే ప్రసారమవుతుందని, అమెరికా అమ్మాయి అనే మరో సీరియల్ మాత్రం మూడు, లేదా నాలుగు వారాలు పట్టవచ్చునని తెలుస్తోంది.

పుట్టుకతో విడిపోయిన గీత, అంజలి అనే ఇద్దరు అక్కచెల్లెళ్ళ చుట్టూ తిరిగే కథ గీతాంజలి. రెండు భిన్నమైన వైఖరులు ప్రదర్శించే ఈ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు వాళ్ళను ఎంతబలంగా కట్టిపడేశాయన్న కథాంశంతో ఈ సీరియల్ సాగుతుంది. ఇక అమెరికా అమ్మాయి విషయానికొస్తే, అమెరికాలో పుట్టి, ఆధునికభావాలతో పెరిగిన ఒక అమ్మాయి సంప్రదాయాలకు విలువనిచ్చే ఒక కుటుంబంలో కోడలిగా ఎదుర్కునే సమస్యలు, అత్తగారి పెత్తనం మధ్య సాగుతుంది.

జీ తెలుగులో సాయంత్రం 6 గంటలనుంచి రాత్రి 10.30 వరకు ఇద్దరు అమ్మాయిలు, అమ్మ నా కోడలా, గోరంత దీపం, ముద్దమందారం, రామా సీత ఎక్కడ, వరూధినీ పరిణయం, మంగమ్మగారి మనవరాలు, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం మూగ మనసులు అనే సీరియల్స్ ప్రసారమవుతుండగా ఇందులో గోరంతదీపం, మంగమ్మ గారి మనవరాలు చాలా కాలంగా ఎక్కువ ప్రేక్షకాదరణతో నడుస్తున్న సీరియల్స్ . అయితే, ఇప్పుడు కొత్త సీరియల్స్ కోసం ఏ సీరియల్స్ కు ముగింపు పలుకుతారనేది తేలాల్సి ఉంది.