• Home »
  • Regional Channels »
  • నెం.1 చానల్ ప్రసారాలు నిలిపివేసిన ఇండియా సైన్

నెం.1 చానల్ ప్రసారాలు నిలిపివేసిన ఇండియా సైన్

నెం.1 న్యూస్ చానల్ ను అప్ లింక్ చేస్తున్న ఎర్త్ స్టేషన్ ఇండియా సైన్ ఆ ప్రసారాలను  నిలిపివేసింది. కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో  ఉన్న చానల్ అప్ లింకింగ్ చార్జీలు కట్టకపోవటంవల్లనే ఇండియా సైన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ చానల్ లైసెన్స్ సొంత దారు వార్త దినపత్రిక.

గతంలో ఈ లైసెన్స్ అద్దెకు తీసుకొని ప్రజా టీవీ పేరుతో చానల్ నడపటానికి ప్రయత్నించినవారు ఆదిలోనే విరమించుకున్నారు. నెం.1 యాజమాన్యం అదే లైసెన్స్ తీసుకొని చానల్ ప్రారంభించినా ఏడాదికి మించి ఎక్కువకాలం నడపలేకపోయింది.