• Home »
  • Data & Projections »
  • 2014-15 లో రూ. 8,500 కోట్లకు దూసుకెళ్ళిన టాటా స్కై విలువ

2014-15 లో రూ. 8,500 కోట్లకు దూసుకెళ్ళిన టాటా స్కై విలువ

టాటా సన్స్, స్టార్ ఇండియా ఉమ్మడి వ్యాపార సంస్థ అయిన టాటా స్కై  డిటిహెచ్ విలువ మదింపు ఒక్కసారిగా దూసుకెళ్ళింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాని దీని విలువ రూ. 8,446 కోట్ల 80 లక్షలుగా మదింపు జరిగింది. తకు ముందు ఆర్థిక సంవత్సరంలో దీని విలువ రూ. 5776 కోట్ల 13 లక్షలుగా నమోదు కాగా ఏదాది కాలంలో 46.7% పెరిగిపోయింది.

2014-15 ఆర్థిక సంవత్సరంలో టాటా స్కై రూ.10 ముఖ విలువగల 4,16,66,670 వాటాలను రూ. 50 ప్రీమియం ధరతో ప్రస్తుత వాటాదారులకే జారీచేసింది. దీంతో కంపెనీ మొత్తం వాటాల సంఖ్య 140,77,70,000 కి చేరింది. రెండు విదతలుగా మొత్తం రూ. 750 కోట్ల రూపాయలు సమీకరించుకుంది.

ఈ సంస్థలో టాటా సన్స్ వాటా 60 శాతం ఉండగా స్టార్ ఇండియాకు 30 శాతం, టెమాసెక్ కు హోల్డింగ్స్ మిగిలిన 10 శాతం వాటా ఉంది. అయితే, టాటా స్కై నష్టాల్లో ఉండటం గమనార్హం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.267 కోట్ల 27 లక్షల నికర నష్టం రాగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఆ నష్టం రూ. 280 కోట్ల 41 లక్షలుంది.