• Home »
  • Entertainment »
  • తమిళ మార్కెట్లోకి త్వరలో కలర్స్ టీవీ ?: సన్ గ్రూప్ తో వయాకామ్ 18 డీ

తమిళ మార్కెట్లోకి త్వరలో కలర్స్ టీవీ ?: సన్ గ్రూప్ తో వయాకామ్ 18 డీ

సన్ టీవీకి తిరుగులేని ఆధిక్యం ఉన్న తమిళ మార్కెట్లో ప్రవేశించటానికి వయాకామ్ 18 ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ టీవీ నుంచి కొనుగోలు చేసిన ప్రాంతీయ చానల్స్ అన్నిటికీ కలర్స్ బ్రాండ్ జోడించిన నేపథ్యంలో దీని పేరు కలర్స్ తమిళ్ అనే ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే, కొత్త చానల్ ప్రారంభిస్తుందా, లేదా ఇప్పటికే ఉన్న చానల్ ఏదైనా కొనుగోలు చేస్తుందా అనే విషయంలో స్పష్టత రాలేదని తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో సన్ టీవీ ఆధిపత్యాన్ని ఎదుర్కోగలిగేలా పెట్టుబడులు పెట్టటానికి చానల్స్ సిద్ధంగా లేవు. పెద్ద ఎత్తున ఇప్పటికే సినిమాలు కొనుగోలు చేసి ఉండటం లాంటి బలాలు సన్ టీవీకి ఎన్నో ఉన్నాయి. భాషతో నిమిత్తం లేకుండా జాతీయ స్థాయిలో కూడా నెంబర్ వన్ స్థానం సంపాదించుకున్న సన్ టీవీ కి మిగిలిన తమిళ చానల్స్ దరిదాపుల్లో కూడా లేవు.

Tamil Market

ఇలాంటి పరిస్థితుల్లో కూడా కలర్స్ ధైర్యం చేయటానికి కారణం కన్నడలో కలర్స్ కన్నడ నెంబర్ వన్ స్థానం దక్కించుకోవటమేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకప్పుడు ఈటీవీ గ్రూప్ లో ఉండగా సన్ గ్రూప్ వారి ఉదయ టీవీ తిరుగులేని నెంబర్ వన్ స్థానంలో ఉండగా యాజమాన్యం మారిన తరువాత కలర్స్ కన్నడ నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది. అందుకే మలయాళ, తమిళ భాషలమీద కలర్స్ దృష్టి  సారించిందంటున్నారు.

అప్పట్లో కేబుల్ పంపిణీ వ్యవస్థ మొత్తం సన్ గ్రూప్ కి చెందిన సుమంగళి కేబుల్ విజన్ చేతుల్లో ఉండటం వల్లనే ఈటీవీ తమిళనాట అడుగుపెట్టటానికి సాహసించలేదు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కలర్స్ ఆ సాహసం చేయబోతోంది. కన్నడలో బిగ్ బాస్ లాంటి కార్యక్రమాలతో ముందుకు దూసుకువచ్చిన ఘనత కలర్స్ గ్రూప్ కి ఉంది. అందుకే భారీ పెట్టుబడులతో, భారీ కార్యక్రమాలతో తమిళనాట విజయం కోసం ప్రయత్నించే అవకాశముంది.