• Home »
  • Entertainment »
  • ఇంగ్లిష్ ఎంటర్టైన్మెంట్ చానల్ ‘Colors Infinity’ ప్రారంభిస్తున్న వయాకామ్ 18

ఇంగ్లిష్ ఎంటర్టైన్మెంట్ చానల్ ‘Colors Infinity’ ప్రారంభిస్తున్న వయాకామ్ 18

వయాకామ్  18 సంస్థ ఇప్పుడు కొత్తగా జనరల్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో  ఒక  ఇంగ్లీష్ చానల్  ప్రారంభిస్తోంది. కలర్స్ ఇన్ఫినిటీ పేరుతో మొదలయ్యే ఈ చానల్ హెచ్ డి వెర్షన్ లోకూ డా అందుబాటులోకి వస్తుంది. ఈ చానల్ కార్యక్రమాల రూపకల్పనలో సెలెబ్రిటీ ద్వయం కరణ్ జోహార్, అలియా భట్ పాలుపంచుకుంటారని సంస్థ గ్రూప్ సీఈవో సుధాంశు వత్స్ చెప్పారు.

ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాదే రెండో అతిపెద్ద దేశంగా గుర్తింపు పొందిన భారత్ లో వ్యక్తిగత పురోగతికి ఇంగ్లిష్ ఒక నిచ్చెనలా పనికొస్తున్నందున ఈ చానల్ కు మంచి ఆదరణ ఉంటుందని యాజమాన్యం అంచనావేస్తోంది. అంతర్జాతీయ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కి ఉన్న డిమాండ్ ను ఇప్పటివరకూ ఎవరూ తీర్చలేకపోయారని, అందుకే కలర్స్ ఇన్ఫినిటీ ఆ లోటును భర్తీ చేస్తుందని సుధాంశు చెబుతున్నారు.

ఈ చానల్ లో  డ్రామా, సూపర్ హీరోస్, కామెడీ, ఫాంటసీ, క్రైమ్ అండ్ థ్రిల్లర్ లాంటి వివిధ విభాగాల కార్యక్రమాలుంటాయి. వీటికితోడు డాన్సింగ్, కుకింగ్, మాజిక్, సింగింగ్, ఇతర లైఫ్ స్టైల్ అంశాలతో రియాల్టీ షోస్ కూడా ఉంటాయి. అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న లైవ్ షోస్, ఈవెంట్స్ కూడా ప్రసారం చేస్తారు. డిజిటల్ కేబుల్ తో బాటు డిటిహెచ్ లో కూడా ఈ రెండు చానల్స్ అందుబాటులో ఉంటాయి.