• Home »
  • Broadcasting »
  • వయాకామ్18 ఆధ్వర్యంలో త్వరలో హిందీ మ్యూజిక్ చానల్ ఎంటీవీ బీట్స్

వయాకామ్18 ఆధ్వర్యంలో త్వరలో హిందీ మ్యూజిక్ చానల్ ఎంటీవీ బీట్స్

ప్రధానమైన నెట్ వర్క్స్ అన్నీ హిందీ మ్యూజిక్ చానల్స్ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ మధ్యనే స్టార్ ఇండియా తన యూత్  జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ వి ని హైబ్రిడ్ మ్యూజిక్ చానల్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వయాకామ్ 18 వంతు వచ్చింది. వయాకామ్ సంస్థ తన హిందీ మ్యూజిక్ చానల్ ఎంటీవీ బీట్స్ ప్రారంభించబోతోంది.

అయితే, అంతకు ముందున్న ఎంటీవీ ఇండీస్ స్థానంలో ఇది ప్రసారమవుతుంది. ఎంటీవీ కార్యక్రమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అందుబాటులో ఉంటాయి.పెప్సీ యాంకర్ స్పాన్సర్ గా ఎంటీవీ ఇండీస్ 2014 ఫిబ్రవరిలో మొదలైన సంగతి తెలిసిందే. ఆ విధంగా ఎంటీవీ బ్రాండ్ ను వాడుకోవాలని నిర్ణయించి అందులొ యూత్ లక్ష్యంగా కాయక్రమాలు ప్రసారం చేస్తుంది. ఎంటీవీ బీట్స్ మాత్రం శాటిలైట్ ప్రసారాలలో ఎంటీవీ ఇండీస్ స్థానాన్ని భర్తీ చేస్తూ మాస్ ప్రేక్షకులకు వినోదాన్నందిస్తుంది.

అన్ని రకాల సంగీతాభిరుచులకూ స్థానం కల్పిస్తూ, ఎంటీవీ బీట్స్ ప్రధానంగా బాలీవుడ్ మ్యూజిక్ మీద దృష్టి సారిస్తుంది. అయితే, ఈ చానల్ ను ఏ రోజు ప్రారంబించేదీ ఇంకా వెల్లడించలేదు. పట్టణాలతోబాటు గ్రామీణ ప్రాంతానికి చెందిన 15-30 ఏళ్ళ మధ్య వయసున్నవాళ్ళే తమ లక్ష్యమని ఎంటీవీ బీట్స్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ చానల్ డిడి వారి ఉచిత డిటిహెచ్ వేదిక అయిన ఫ్రీడిష్ ద్వారా కూడా అందుబాటులోకి వస్తుంది.