• Home »
  • International Channels »
  • బిబిసి లైవ్ టీవీకి తగ్గిన ఆదరణ : వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపు

బిబిసి లైవ్ టీవీకి తగ్గిన ఆదరణ : వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపు

బ్రిటన్ లో లైవ్ బిబిసి చానల్ చూడాలనుకుంటున్న వాళ్ళు గణనీయంగా తగ్గిపోయారు. దీంతో లైసెన్స్ ఫీజు చెల్లించటం ఆపేశారు. లైసెన్సు ఫీజు ఆదాయం మీద నడిచే బిబిసి కి ఆ ఆదాయంలో లోటు ఏర్పడటంతో ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ముందుగా ఉద్యోగుల మీద వేటు పడింది. వెయ్యి మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. కొన్ని విభాగాలను విలీనం చేయాలని, కొంతమందికి అదనపు బాధ్యతలు అప్పగించాలని కూడా నిర్ణయించింది.

ఇంటర్మెట్ లో చూడటానికి అలవాటు పడుతున్న వారు పెరిగిపోవటంతో లైవ్ టీవీకి చాలామంది దూరమవుతున్నట్టు బిబిసి గ్రహించింది. అందుకే లైసెన్స్ ఫీజు చెల్లించి  టీవీ చూసేవాళ్ళ సంఖ్య తక్కువవుతూ ఉండటంతో ఆదాయం బాగా తగ్గిపోయిందని బిబిసి చెబుతోంది. మన కరెన్సీలో చెప్పాలంటే ఒక్కో చందాదారుడు బిబిసి కి దాదాపుగా ఏడాదికి 15 వేలు చెల్లించాల్సి ఉంటుంది. పదిలక్షలమంది చందాదారులు తగ్గటంతో 1500 కోట్ల వార్షికాదాయం తగ్గిపోయింది.