• Home »
  • Data & Projections »
  • దేశవ్యాప్తంగా అన్ని న్యూస్ చానల్స్ కలిసి మార్కెట్ వాటా 6.5 శాతమే

దేశవ్యాప్తంగా అన్ని న్యూస్ చానల్స్ కలిసి మార్కెట్ వాటా 6.5 శాతమే

దేశవ్యాప్తంగా 800 కు పైగా లైసెన్స్ పొందిన చానల్స్ ఉండగా అందులో ప్రసారాలు అందిస్తున్నవి సుమారు 750. వాటిలో న్యూస్ చానల్స్ దాదాపు 150. అంటే 20 శాతం. కానీ ప్రేక్షకాదరణలో వీటి మార్కెట్ వాటా మాత్రం 6.53 శాతం మాత్రమే. ప్రాంతీయ న్యూస్ చానల్స్ 3.5 శాతం, హిందీ న్యూస్ చానల్స్ 3 శాతం ఉండగా ఇంగ్లిష్ న్యూస్ చానల్స్ వాటా కేవలం 0.03 శాతం.

జనరల్ ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే హిందీ చానల్స్ వాటా 28.4 శాతం ఉండగా ప్రాంతీయ భాషలన్నిటిలో కలిపి 29.6 శాతం ఉంది. మ్యూజిక్, మూవీస్ చానల్స్ హిందీలో 16 శాతం ఉంది. ప్రాంతీయ భాషల్లోకి వచ్చేసరికి అది 9.3 శాతంగా నమోదైంది. మొత్తంగా చూస్తే హిందీ వినోదం వాటా 44.4 శాతం, ప్రాంతీయ భాషల్లో వినోదం వాటా 38.9 శాతముంది. అంటే మొత్తం 83.3 శాతం.

మిగిలిన విభాగాలలో పిల్లల చానల్స్, స్పోర్ట్స్ చానల్స్,   డిస్కవరీ, నేషనల్ జాగ్రఫిక్, యానిమల్ ప్లానెట్ లాంటి ఇన్ఫొటైన్మెంట్ చానల్స్ వాటా 11.2 శాతం తీసేస్తే న్యూస్ చానల్స్ వాటా కేవలం 6.53 శాతమే. ఇందుకీ హిందీ, ప్రాంతీయ భాషల, ఇంగ్లీష్ న్యూస్ చానల్స్ కలిసి ఉన్నాయి.

chnnel Share

 

హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ 28.4
మూవీస్ 13.4
మ్యూజిక్ 2.6
న్యూస్ 3.0
ప్రాంతీయ జనరల్ ఎంటర్టైన్మెంట్ 29.6
మూవీస్ 6.6
మ్యూజిక్ 2.7
న్యూస్ 3.5
ఇతర చానల్స్ స్పోర్ట్స్, కిడ్స్, 7.7
ఇన్ఫొటైన్మెంట్, ఇంగ్లిష్ న్యూస్ etc., 3.5