• Home »
  • Top Stories »
  • రిపబ్లిక్ డే తరహాలో యోగా డే కవరేజ్

రిపబ్లిక్ డే తరహాలో యోగా డే కవరేజ్

Yoga Day

ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దూరదర్శన్  రిపబ్లిక్ డే తరహాలో భారీగా కవర్ చేయాలని నిర్ణయించుకుంది. రాజ్ పథ్ లో జరిగే ఈనెల  21న ఈ ఈవెంట్ సందర్భంగా 25 హై డెఫినిషన్ కెమెరాలు వాడటానికి రంగం సిద్ధం చేశారు.  అందులో రెండు కెమెరాలు ఇండియా గేట్ పైన ఉంటాయి. మరికొన్ని కెమెరాలు జిమ్మీ జిబ్  మీద, అనేక అడుగుల ఎత్తున హైడ్రాలిక్ క్రేన్ల మీద పెట్టి ఇండియా గేట్ నుంచి విజయ్ చౌక్  దాకా విహంగ వీక్షణానికి వెసులుబాటు కల్పిస్తారు.

ఈ సామూహిక యోగాసనాల కార్యక్రమంలో ప్రజలు అసంఖ్యాకంగా పాల్గొంటారని అంచనావేస్తున్నారు. ప్రధాన వేదిక వద్దనే 18 కెమెరాలుంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలలో చిత్రీకరించటానికి, ప్రసారం చేయటానికి డిడి సిబ్బంది సిద్ధం కాగా ప్రత్యక్షప్రసారాలకు కొన్ని ఒబి వ్యాన్లు కూడా వాడుతున్నారు. ఇంజనీర్లు, సినిమటోగ్రాఫర్లు తదితరులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఆ రోజు విధుల్లో ఉండేలా నియోగించారు. వీళ్లలో చాలామందికి గతంలో స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, కామన్ వెల్త్ గేమ్స్ లాంటి ప్రత్యేకమైన ఈవెంట్స్ కవర్ చేసిన అనుభవముంది.