• Home »
  • Entertainment »
  • జీ కుటుంబ అవార్డులు-2015 ఎంపిక కోసం ’జీ కన్నడ ’ సంచార బాలెట్ బాక్స్

జీ కుటుంబ అవార్డులు-2015 ఎంపిక కోసం ’జీ కన్నడ ’ సంచార బాలెట్ బాక్స్

జీ తెలుగు బాటలోనే జీ కన్నడ చానల్ కూడా ఈ ఏడాది జీ కుటుంబ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రేక్షకులు తమ అభిమాన బుల్లితెర నటీనటులను, యాంకర్స్ ను ఎన్నుకోవటానికి వీలుగా బాలెట్ బాక్స్ రూపొందించి ప్రేక్షకులను చేరుకోవటానికి అన్ని ముఖ్యమైన పట్టణాలకూ వెళ్ళేలా ఏర్పాటు చేసింది. ఈ సంచార పోలింగ్ బూత్ ను జీ కన్నడ బిజినెస్ హెడ్ సిజు ప్రభాకర్ ప్రారంభించారు.

జీ చానల్ అభివృద్ధిలో భాగస్వాములై, ప్రేక్షకుల దైనందిన జీవితంలో భాగస్వాములైన నటీనటులను, యాంకర్స్ ను, సాంకేతిక నిపుణులను సత్కరించటానికి ఇదొక అవకాశంగా భావిస్తున్నట్టు నిర్వాహకులు చెప్పారు. అవార్డుల ప్రదానోత్సవం కూడా టీవీ, సినీ రంగ ప్రముఖుల సమక్షంలో అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పారు.
zee rasikar
ఇందుకోసం రసికర్ ఎక్స్ ప్రెస్ పేరుతో ఒక సంచార పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి కర్నాటకలోని మాండ్యా, మంగుళూరు, శివమొగ్గ, హుబ్లీ, ధార్వాడ్ తుముకూర్, బెంగళూరు సహా అన్ని ప్రధాన పట్టణాలకూ వెళ్ళేలా చేయటంతోబాటు ఎస్సెమ్మెస్ ద్వారా కూడా వోట్లు స్వీకరిస్తున్నారు.