• Home »
  • Entertainment »
  • జీ కన్నడ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమం 17,18 తేదీల్లో ప్రసారం

జీ కన్నడ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమం 17,18 తేదీల్లో ప్రసారం

జీ కన్నడ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమం 17,18 తేదీల్లో ప్రసారం

కన్నడ చలనచిత్ర, సంగీత పరిశ్రమలకు ఘనంగా అభినందిస్తూ కర్నాటకలో మొట్టమొదటి సారిగా జీ కన్నడ చానల్ జీ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల 6 న నిర్వహించారు. దక్షిణాది సినీ, సంగీత ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరైన  ఈ మెగా ఈవెంట్ ను ఈ నెల 17,18 తేదీలలో ( శని, ఆది వారాలు ) ప్రసారం చేయాలని జీ కన్నడ నిర్ణయించింది. జీ కన్నడ కుటుంబానికి చెందిన నటీనటులు, గాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమం నేరుగా చూడలేనివారు కోట్లాదిమంది ఈ మ్యూజిక్ అవార్డుల ప్రసారం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

కన్నడ సంగీత పరిశ్రమ ప్రముఖులంతా ఒకచోట చేరి స్వర్గీయ సి. అశ్వథ్ కు, గ్రామీ అవార్డు రిక్కీ కేజ్ కు, సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఘనసత్కారం చేశారు. మొత్తం నాలుగు విభాగాలలో అవార్డులివ్వటం కోసం ఎస్ ఎమ్ ఎస్, ఆన్ లైన్ ద్వారా ప్రేక్షకులు వోటింగ్ లో పాల్గొన్నారు. బెస్ట్ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ, ఆనరింగ్ కేటగిరీ, పాపులర్ కేటగిరీలలో అవార్డులకు ఎంపిక జరిగింది. ఎస్. నారాయణ్, నందిత, కె ఎస్ ఎల్ స్వామి, ఎం డి పల్లవి జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు.

ఈ మొత్తం ప్రక్రియ నామినేషన్లతో మొదలై, ఆ తరువాత ఎస్ ఎమ్ ఎస్, ఆన్ లైన్ వోటింగ్ జరిగాక గ్రాండ్ జ్యూరీ నిర్ణయం అయ్యాక ఈ మెగా ఈవెంట్ కి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ఫైనల్స్ చేరుకున్న 30 మంది సరిగమప్ లిటిల్ చాంప్స్ జాబితాను కూడా ఈ వేదిక వెల్లడించింది. వారి అద్భుతమైన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. మొత్తంగా ఈ మ్యూజికల్ నైట్ ను రెండు భాగాలుగా 17,18 (శని, ఆదివారాల్లో) సాయంత్రం 7 గంటలనుంచి ప్రసారం చేస్తున్నట్టు జీ కన్నడ ప్రకటించింది