• Home »
  • Legal Issues »
  • జీ ఆకాశ్ న్యూస్ మొత్తం జీ మీడియాకే

జీ ఆకాశ్ న్యూస్ మొత్తం జీ మీడియాకే

జీ ఆకాశ్ లో మిగిలిన 40% వాటాను కూడా తీసుకోవటం ద్వారా ఆ సంస్థను పూర్తిగా తనలో కలుపుకోవాలని జీ మీడియా నిర్ణయించింది. ఇప్పటివరకు అందులో 60% వాటా ఉంది. ఈ సంస్థ ఆధ్వర్యంలోని 24 ఘంటా అనే చానల్ బెంగాలీ వార్తలు ప్రసారం చేస్తుంది. ఈ 40% వాటాకోసం జీ మీడియా రూ. 47 కోట్లు చెల్లించటానికి సిద్ధపడింది.

రెండు సంస్థల డైరెక్టర్ల బోర్డు ఫిబ్రవరి 1న తీసుకున్న ఈ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయటానికి 120 రోజులు పడుతుందని అంచనావేశారు. ప్రాంతీయ న్యూస్ చానల్స్ అన్నిటిమీద పూర్తి పట్టు ఉండాలని జీ తీసుకున్న నిర్ణయం ఫలితంగానే ఈ వాటా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కొనుగోలు ఫలితంగా వాటాలలో వచ్చే మార్పును సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజికి కూడా తెలియజేశారు.

ఇటీవలికాలంలో జీ మీడియా సంస్థ అనేక వార్తా విభాగాల కొనుగోలులో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. 2016 ఫిబ్రవరిలో ఇండియాటుడే గ్రూప్ లోని టుడే మర్చండైజ్, టుడే రిటైల్ నెట్ వర్క్స్ ను 165 కోట్లకు కొనుగోలు చేయగా, 2016 నవంబర్ లని అమ్బానీకి చెందిన ఎఫ్ ఎం రేడియో వ్యాపారంలో  49% వాటాలు కొనుగోలు చేసింది. ఆ తరువాత మూడేళ్లలో మిగిలిన వాటా కొనటానికి ఒప్పందం చేసుకుంది. అంతకు ముందు మౌర్య టీవీనికూడా సొంతం చేసుకుంది. దాన్ని జీ బీహార్, ఝార్ఖండ్ గా పేరుమార్చింది.

జీ మీడియా ఆద్వర్యంలో నాలుగు జాతీయ, 10 ప్రాంతీయ చానల్స్ తో మొత్తం 14 చానల్స్ ఉన్నాయి. అవి జీ  న్యూస్, జీ బిజినెస్, వియాన్, జీ హిందుస్తాన్, జీ పంజాబ్ హర్యానా హిమాచల్, జీ మధ్యప్రదేశ్ చత్తీస్