• Home »
  • Entertainment »
  • జీ దక్షిణాది చానల్స్ కమర్షియల్ హెడ్ వాసిరెడ్డి రాజేశ్ రాజీనామా

జీ దక్షిణాది చానల్స్ కమర్షియల్ హెడ్ వాసిరెడ్డి రాజేశ్ రాజీనామా

జీ గ్రూప్ దక్షిణాది చానల్స్ కమర్షియల్ హెడ్ గా పనిచేస్తున్న వాసిరెడ్డి రాజేశ్ రాజీనామా చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ కన్నడ, తమిళ చానల్స్ ను కూడా ఆ పదవిలో ఉంటూ నిర్వహిస్తూ వచ్చారు. 2005 లో వైస్ ప్రెసిడెంట్ – కమర్షియల్ హోదాలో చేరి 2015 లో వెర్టికల్ హెడ్ గా పదోన్నతి పొందారు. ఈ రాజీనామాతో ఆయనకు  పన్నెండున్నరేళ్ళ జీ టీవీ బంధం తెగిపోయినట్టయింది.

జీ గ్రూప్ లో చేరకముంది ఆయన ఈనాడు గ్రూప్ లో దశాబ్ద కాలం వివిధ హోదాలలో పనిచేశారు. 1995 లో ఉషాకిరణ మూవీస్ లో ప్రొడక్షన్ హెడ్ గా ఉద్యోగ జీవితం ఆరంభించారు.  జీ గ్ర్రూప్ లో ఆయన  జీ తెలుగు, జీ కన్నడ, జీ తమిళ్ చానల్స్  ప్రోగ్రామింగ్, మార్కెటింగ్, ఐటి, కార్పొరేట్ సర్వీసులు, సినిమాల ప్రసార హక్కుల కొనుగోలు వంటి విభాగాలను పర్యవేక్షిస్తూ వచ్చారు.