• Home »
  • BARC »
  • బార్క్ రేటింగ్స్ : మళ్ళీ మొదటి స్థానం దక్కించుకున్న జీ తెలుగు

బార్క్ రేటింగ్స్ : మళ్ళీ మొదటి స్థానం దక్కించుకున్న జీ తెలుగు

మా టీవీ మళ్ళీ రెండో స్థానానికి పడిపోయింది. కొంతకాలంగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ వచ్చిన జీ తెలుగు 33 వ వారంలో రెండో స్థానంలోకి వెళ్ళినా మళ్ళీ ఇప్పుడు తన మొదటి స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. దీంతో ఒకవారానికే మా టీవీ మళ్ళీ తన రెండో స్థానంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. జెమినీ టీవీ నాలుగో స్థానానికి పరిమితం కాక తప్పలేదు.

జీ తెలుగుకు 137862 జివిటి లు లభించగా, మా టీవీకి 1100358 జివిటిలు మాత్రమే దక్కాయి. ఆ తరువాత స్థానంలో ఉన్న ఈటీవీ తెలుగు 109287 జివిటిలతో మూడో స్థానంలోకి రాగా జెమినీ నాలుగో స్థానానికి పడిపోయింది.