• Home »
  • Entertainment »
  • మేడారం జాతరలో జీ తెలుగు ప్రచారం: అప్సర అవార్డులకు వోట్ల సేకరణ

మేడారం జాతరలో జీ తెలుగు ప్రచారం: అప్సర అవార్డులకు వోట్ల సేకరణ

తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన మేడారం జాతర సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టటం ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైనట్టు జీ తెలుగు తెలియజేసింది. దాదాపు 2 కోట్ల మంది ప్రజలు వరంగల్ జిల్లా తాడ్వాయ్ మండలంలో రెండేళ్ళకొకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరు కాగా పోస్టర్లు, ఎల్ ఇడి స్క్రీన్లలో జీ తెలుగు చానల్ ప్రోమోలు ప్రసారం చేయటం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టు పేర్కొంది.

వివిధ కార్యక్రమాల ద్వారా ఉనికి చాటుకునేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనట్టు చానల్ వెల్లడించింది. త్వరలో ప్రసారం కాబోయే ముత్యాలముగ్గు, దేనికైనా రెడీ  లాంటి కార్యక్రమాలకు తగిన ప్రచారం కల్పించినట్టు పేర్కొంది. అదే విధంగా జీ తెలుగు స్టాల్ ను దాదాపు ఐదు లక్షలమంది సందర్శించగా వారిలో లక్షమందికి పైగా అప్సర అవార్డులకు వోటేసినట్టు కూడా జీ తెలుగు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు.