• Home »
  • BARC »
  • 31వ వారంలోనూ నెంబర్ వన్ జీ తెలుగు, నాలుగో స్థానానికి పడిపోయిన జెమిని

31వ వారంలోనూ నెంబర్ వన్ జీ తెలుగు, నాలుగో స్థానానికి పడిపోయిన జెమిని

తెలుగు ఎంటర్టైన్మెంట్ మార్కెట్ లో జీ తెలుగు ఆధిక్యం కొనసాగుతోంది. మా టీవీ రెండో స్థానంలో ఉండిపోగా మూడు, నాలుగు స్థానాలు తారుమారయ్యాయి. జెమినీ టీవీ తన మూడో స్థానం కూడా కోల్పోయి నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇరవయ్యవ వార్షికోత్సవ కార్యక్రమాలతో కొంత మేరకు ఎక్కువమంది ప్రేక్షకులను ఆకట్టుకోగలిగిన ఈ టీవీ తన నాలుగో స్థానం నుంచి కాస్త పైకి వచ్చి మూడో స్థానం సంపాదించుకుంది.

31 వ వారానికి గాను బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) లెక్కగట్టిన ప్రేక్షకాదరణ ప్రకారం జీ తెలుగు చానల్ కు 1,32,964 జివిటి లు రాగా, మా టీవీ కి 1,18,663 జివిటి లు, ఈటీవీకి 1,09,120 జివిటి లు దక్కాయి.

తమిళంలో సన్ టీవీ 294905 జివిటి లతో మొదటి స్థానంలో ఉండగా అదే గ్రూపుకు చెందిన కె టీవీ 96772 జివిటిలతో రెండో స్థానంలోను, స్టార్ విజయ్ 82,173 జివిటిలతో మూడో స్థానంలోనూ ఉన్నాయి. కన్నడ మార్కెట్ లో కలర్స్ కన్నడ 76,961 జివిటిలతో మొదటి స్థానంలో ఉండగా జీ కన్నడ 53,277 జివిటిలతో రెండో స్థానానికి చేరింది. ఉదయ టీవీ 47,475 జివిటిలతో మూడో స్థానానికి పడిపోయింది. మలయాళం మార్కెట్ లో ఏషియానెట్ 182998 జివిటిలతో మొదటి స్థానంలో, మళవిల్ మనోరమ 54,650 జివిటిలతో రెండో స్థానంలో, ఏషియానెట్ మూవీస్ 37,523 జివిటిలతో మూడో స్థానంలో ఉన్నాయి.