• Home »
  • BARC »
  • నెం.1 స్థానంలో కొనసాగుతున్న జీ తెలుగు: తరువాత రాంకుల్లో ఈటీవీ, మా, జెమిని

నెం.1 స్థానంలో కొనసాగుతున్న జీ తెలుగు: తరువాత రాంకుల్లో ఈటీవీ, మా, జెమిని

వరుసగా రెండో వారం కూడా తెలుగు చానల్స్ లో జీ తెలుగు తన ఆధిక్యాన్ని కొనసాగించింది. మార్చి 26 – ఏప్రిల్ 1 తేదీల మధ్య సాగిన 13 వారంలో ఈ టీవీ కంటే సుమారు 9 శాతం ఆధిక్యం కనబరుస్తూ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దీంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది.

బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) అందించిన తాజా సమాచారం ప్రకారం జీ తెలుగు (411328 వేలు), ఈటీవీ (378141 వేలు ) వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. మూడో స్థానంలో మా టీవీ (365280 వేలు) , నాలుగో స్థానంలో జెమిని టీవీ ( 296840 వేలు ) కొనసాగుతున్నాయి.