• Home »
  • BARC »
  • నెం.1 స్థానంలో స్థిరంగా జీ తెలుగు, నాలుగో స్థానానికి పరిమితమైన జెమినీ

నెం.1 స్థానంలో స్థిరంగా జీ తెలుగు, నాలుగో స్థానానికి పరిమితమైన జెమినీ

పదో వార్షికోత్సవం తరువాత జీ తెలుగు దాదాపు స్థిరంగా తన మొదటి స్థానాన్ని కాపాడుకుంటూ వస్తోంది. తాజాగా బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) జారీచేసిన 35 వ వారపు ప్రేక్షకాదరణ సమాచారం కూడా అదే విషయాన్ని ధ్రువీకరించింది. మా టీవీ, ఈటీవీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉండగా జెమినీ టీవీ తన నాలుగో స్థానాన్ని ఈ వారం కూడా కొనసాగించింది.

35 వ వారంలో జీ తెలుగు 144889 జివిటి లతో మొదటి స్థానం దక్కించుకోగా, రెండో స్థానంలో ఉండిపోయిన మా టీవీకి 120158 జివిటి లు లభించాయి. ఇక మూడో స్థానంలో ఉన్న ఈటీవీకి 117204 జివిటి లు వచ్చాయి. అంతకంటే దిగువన ఉన్న జెమినీ నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది