• Home »
  • BARC »
  • బార్క్ రేటింగ్స్ లో జీ తెలుగు నెం.1, నాలుగో స్థానంలో జెమిని

బార్క్ రేటింగ్స్ లో జీ తెలుగు నెం.1, నాలుగో స్థానంలో జెమిని

టామ్ రేటింగ్స్ కు భిన్నంగా బార్క్ సర్వే జీ తెలుగునే మళ్ళీ నెంబర్ వన్ గా తేల్చింది. తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో ప్రధానమైన నాలుగు చానల్స్ లో వరుసగా జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ, జెమిని ఉన్నట్టు తాజా వారానికి విడుదలచేసిన రేటింగ్స్ డేటాలో పేర్కొంది.

జీ తెలుగు చానల్ 138794 జివిటి లు సంపాదించి నెంబర్ వన్ స్థానంలో ఉండగా మా టీవీ 112677 జివిటిలతో రెండో స్థానానికే పరిమితమైంది. మూడో స్థానంలో ఉన్న ఈటీవీ 103702 జివిటి లు సాధించగా జెమిని టీవీ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

ఈ నాలుగు చానల్స్ వయసు, వాటి రాంక్ పూర్తి వ్యతిరేక క్రమంలో ఉండటం విశేషం. మొట్టమొదటగా ప్రారంభమైన జెమినీ నాలుగో ర్యాంకులో, ఆ తరువాత మొదలైన ఈటీవీ మూడో ర్యాంకులో, తరువాత మొదలైన మాటీవీ రెండో ర్యాంకులో ఉండగా ఈ మధ్యే పదేళ్ళు నిండిన జీ తెలుగు నెంబర్ వన్ స్థానంలో ఉంది.