• Home »
  • Entertainment »
  • టామ్ రేటింగ్స్ లోనూ నెంబర్ వన్ జీ తెలుగు

టామ్ రేటింగ్స్ లోనూ నెంబర్ వన్ జీ తెలుగు

కొద్ది వారాలుగా బార్క్  రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంటూ టామ్ లెక్కల ప్రకారం మూడో  స్థానానికే పరిమితమవుతూ వచ్చిన జీ తెలుగు 28 వ వారం డేటా ప్రకారం నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది. తెలుగులో జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్నీ తగ్గుదల బాటలో సాగినప్పటికీ జీ తెలుగు మాత్రం నాలుగు శాతం ప్రేక్షాదరణ పెంచుకోవటం ద్వారా నెంబర్ వన్ అయినట్టు టామ్ వెల్లడించింది.

జీ తెలుగు అంతకు ముందువారం 493 జీఆర్పీలు సంపాదించగా, తాజాగా 28 వ వారంలో 512 జీఆర్పీలకు పెరిగింది. మా టీవీ అంతకుముందు వారం తెచ్చుకున్న 508 జీఆర్పీల నుంచి 494 జీఆర్పీలకు పడిపోయింది. ఆ విధంగా మూడు శాతం ప్రేక్షకాదరణ తగ్గి రెండో స్థానానికి పరిమితమైంది. 27 వ వారంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న జెమినీ 521 జీఆర్పీలనుంచి 486 జీఆర్పీలకు పడిపోవటంతో 28 వవారంలో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జెమినీ ప్రేక్షకాదరణ 7 శాతం పడిపోవటం గమనార్హం.

తమిళంలో 6%  ప్రేక్షకదరణ తగ్గినప్పటికీ సన్ టీవీ మొదటి స్థానానికి ఎలాంటి ఢోకా లేదని చాటుకుంది. 27వ వారంలో 1277 జీఆర్పీలు సంపాదించుకున్న సన్ టీవీ 28 వ వారానికి 1201 జీఆర్పీలకు పడిపోయింది. విజయ్ టీవీ  366 జీఆర్పీల నుంచి 341 జీఆర్పీలకు తగ్గి 7 శాతం కోల్పోయి  రెండో స్థానం కొనసాగిస్తుండగా జీ తమిళ్ 128 జీఆర్పీల నుంచి 125 జీఆర్పీలకు తగ్గి మూడోస్థానంలో ఉంది.

జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్ని దక్షిణాది భాషల్లో మొత్తంగా తగ్గుదల బాటలో ఉన్నప్పటికీ కన్నడ మార్కెట్ మత్రం 6% పెరుగుదల నమోదుచేసుకుంది. సన్ గ్రూప్ వారి ఉదయ టీవీ ఏకంగా 12% పెరిగింది. 421 జీఆర్పీల నుంచి 471 జీఆర్పీలకు పెరిగింది. కలర్స్ కన్నడ 399 జీఆర్పీలనుంచి 421 జీఆర్పీలకు పెరిగి 5 శాతం పెరుగుదలతో రెండో స్థానంలో ఉంది. ఇక సువర్ణ 248 జీఆర్పీలనుంచి 253 జీఆర్పీలకు పెరిగినా మూడో స్థానానికి పరిమితమైంది.

మొత్తంగా మలయాళీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ ఐదు శాతం ప్రేక్షకాదరణ కోల్పోయాయి. ఏషియానెట్ 7 శాతం తగ్గింది. 928 జీఆర్పీల నుంచి 866 జీఅర్పీలకు పడిపోయినా మొదటి స్థానం కొనసాగించింది. 259 జీఆర్పీలు సంపాదించుకున్న  మళవిల్ మనోరమ నెంబర్ టూ స్థానంలో ఉండగా సన్ గ్రూప్ వారి సూర్య టీవీ 198 జీఆర్పీలతో మూడో స్థానానికి పరిమితమైంది.