• Home »
  • Entertainment »
  • 39వ వారం టామ్ రేటింగ్స్ లోనూ నెం.1 జీ తెలుగు

39వ వారం టామ్ రేటింగ్స్ లోనూ నెం.1 జీ తెలుగు

టామ్ సంస్థ ప్రకటించిన టీవీ రేటింగ్స్ లో సెప్టెంబర్ 26 తోముగిసిన 39 వ వారంలోనూ తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో జీ తెలుగు తన మొదటి స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చింది. జీ తెలుగు 592 స్థూల రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా మా టీవీ 528 జిఆర్పీలతో రెండో స్థానంలోను, ఈటీవీ 414 జీఆర్పీలతో మూడో స్థానంలోను ఉండగా అతికొద్ది తేడాలో వెనుకబడిన జెమినీ 412 జీఆర్పీలతో నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. దూరదర్శన్ సప్తగిరికి జీఆర్పీలు, దూరదర్శన్ యాదగిరికి జీఆర్పీలు మాత్రమే దక్కాయి.

కన్నడ మార్కెట్ పరిశీలిస్తే కలర్స్ కన్నడ 391 జీఆర్పీలతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా, 368 జీఆర్పీలత్ఫో ఉదయ రెండో స్థానంలో, 228 జీఆర్పీలతో జీ కన్నడ మూడో స్థానంలో, సువర్ణ 204 జీఆర్పీలతో నాలుగో స్థానంలో నిలిచాయి. డిడి చందన కేవలం 14 జీఆర్పీలతో సరిపెట్టుకుంది.

మలయాళం మార్కెట్ విషయానికొస్తే, ఏషియనెట్ 949 జీఆర్పీలతో తిరుగులేని నెంబర్ వన్ స్థానంలో ఉండగా, మళవిల్ మనోరమ 278 జీఆర్పీలతో రెండో స్థానంలో, సూర్య 222 జీఆర్పీలతో మూడో స్థానంలో, కొత్తగా వచ్చిన చానల్ అయినా, ఫ్లవర్స్ 166 జీఆర్పీలతో నాలుగో స్థానంలో ఉన్నాయి. ఆ తరువాత ఐదో స్థానం 110 జీఆర్పీలున్న కైరలికి దక్కగా 53 జెఆర్పీలతో అమృతకు ఆరో స్థానం లభించింది. డిడి మలయాళం కేవలం 14 జీఆర్పీలకు పరిమితమైంది.

తమిళ మార్కెట్ లో ఎప్పటిలాగానే సన్ టీవీ తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంటూ 1190 జీఆర్పీలతో నెంబర్ వన్ స్థానంలో ఉంది. 410 జీఆర్పీలతో స్టార్ విజయ్ రెండో స్థానంలో ఉండగా జీ తమిళ 129 జీఆర్పీలతో మూడో స్థానానికి రావటంతో 117 జీఆర్పీలు తెచ్చుకున్న కలైంజ్ఞర్ టీవీ నాలుగో స్థానానికి పరిమితమైంది.