• Home »
  • BARC »
  • BARC రేటింగ్స్ లో జీ తెలుగు నెంబర్ 1

BARC రేటింగ్స్ లో జీ తెలుగు నెంబర్ 1

తాజా రేటింగ్స్ ప్రకారం తెలుగు చానల్స్ లో జీ తెలుగు నెంబర్ వన్ స్థానం సంపాదించుకుంది. దీంతో మాటీవీ రెండో స్థానానికి, జెమినీ మూడో స్థానానికీ పడిపోయాయి. ఈటీవీ నాలుగో స్థానంలో ఉంది. జీ తెలుగు 114183 జివిటి లు సంపాదించుకోగా మా టీవీకి 107546 జివిటి లు, జెమిని కి 107132 జివిటి లు దక్కాయి.

తమిళంలో సన్ టీవీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంటూ 291913 జివిటి లు సంపాదించుకోగా, రెండో స్థానం సైతం సన్ గ్రూపుకు చెందిన కెటివి సంపాదించుకుంది. సన్ టీవీలో నాలుగోవంతుకూడా లేని స్టార్ విజయ్ 73077జివిటి లతో మూడో స్థానంలో ఉంది.

కన్నడలో కలర్స్ కన్నడ ( ఒకప్పుడు ఈటీవీ కన్నడ ) మళ్ళీ మొదటి స్థానం దక్కించుకునేలా 71724 జివిటి లు తెచ్చుకుంది. దీంతో జీ కన్నడ రెండో స్థానంలోను. సన్ గ్రూప్ వారి ఉదయ మూవీస్ మూడో స్థానంలోను ఉండిపోయాయి. మలయాళంలో ఏషియానెట్ మొదటి స్థానంలో ఉండగా సన్ గ్రూపుకు చెందిన సూర్య టీవీ రెండో స్థానంలో, మళవిల్ మనోరమ మూడో స్థానంలో ఉన్నాయి.

బెంగాలీ టీవీ చానల్స్ లో స్తార్ జల్సా మొదటి స్థానంలో ఉండగా జీ బంగ్లా రెండో స్థానం, కలర్స్ బంగ్లా మూడో స్థానం దక్కించుకున్నాయి. మరాఠీ మార్కెట్ లో జీ మరాఠీ ముందుండగా ఆ తరువాత స్థానాల్లో వరుసగా జీ టాకీస్, కలర్స్ మరాఠీ ఉన్నాయి.