• Home »
  • BARC »
  • బార్క్ రేటింగ్స్ దీ అదే మాట : జీ తెలుగు నెం.1, జెమినీ నెం.2

బార్క్ రేటింగ్స్ దీ అదే మాట : జీ తెలుగు నెం.1, జెమినీ నెం.2

టామ్ కంటే ఒక రోజు ఆలస్యంగా వెలువడే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) అందించే టీవీ రేటింగ్స్ లోనూ జీ తెలుగు తన నెంబర్ వన్ స్థానంలో నిలబడింది. రెండో స్థానంలో జెమినీ టీవీ ఉండగా, ఈటీవీ మూడులో, మా టీవీ నాలుగులో ఉన్నాయి. మా టీవీ ప్రసారాలను హాత్ వే కొద్దిరోజులపాటు నిలిపివేసిన ప్రభావం రేటింగ్స్ మీద ఉన్న విషయం పాఠకులకు తెలుసు. ఈ వారం టామ్ , బార్క్ ఒకే విధంగా రేటింగ్స్ వెల్లడించటం విశేషం.

జీ తెలుగు కు 1,17,355 జివిటి లు రాగా, జెమినీ టీవీకి 1,02,358 జివిటిలు, ఈ టీవీకి 94,713 జివిటిలు వచ్చాయి. దీంతో ఈ మూడూ వరుసగా మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. టామ్ లెక్కల ప్రకారం చాలా కాలం జీ తెలుగు వెనకబడగా, బార్క్ రేటింగ్స్ లో ఆధిక్యం ప్రదర్శిస్తున్న తరువాత టామ్ ఆలస్యంగా మొదలుపెట్టి జీ తెలుగుకు నెంబర్ వన్ స్థానమిస్తోంది.