• Home »
  • BARC »
  • రేటింగ్స్ లో జీ తెలుగు నెం.1 : ఈటీవీకి నాలుగో రాంక్

రేటింగ్స్ లో జీ తెలుగు నెం.1 : ఈటీవీకి నాలుగో రాంక్

బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) తాజాగా 30 వ వారానికి ప్రకటించిన రేటింగ్స్ లోనూ జీ తెలుగు తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ టీవీ మాత్రం వరుసగా నాలుగో ర్యాంకుకే పరిమితమవుతూ వస్తోంది.

barc 30

జీ తెలుగు కు 30 వ వారంలో 138113 జివిటి లు లభించగా, మా టీవీ 125646 జివిటిలతో రెండో స్థానంలో కొనసాగుతూ వస్తోంది. జెమినిటీవీ  1,13,671 జివిటి లతో మూడో స్థానంలో ఉండగా ఈటీవీ నాలుగో స్థానంలో ఉంది.

తమిళ చానల్స్ లో సన్ టీవీ 298575 జివిటిలతో  తిరుగులేని నెంబర్ వన్ స్థానం కొనసాగిస్తూ ఉండగా సన్ గ్రూప్ వారి మరో ఎంటర్టైన్మెంట్ చానల్ కెటివి 98,198 జివిటిలతో రెండో స్థానంలోనూ, స్టార్ గ్రూప్ వారి స్టార్ విజయ్ 85,301 జివిటిలతో మూడో స్థానంలోనూ నిలబడ్డాయి.

Barc tamil 30

కన్నడ మార్కెట్ లో కలర్స్ కన్నడ తన ఆధిక్యాన్ని చాటుకుంటూ వస్తోంది. 79,960  జివిటిలతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా సన్ గ్రూప్ వారి ఉదయ టీవీ 46,421 జివిటిలతో సువర్ణ ను తొలగించి రెండో స్థానంలోకి రాగా జీ కన్నడ 41,042 జివిటిలతో మూడో స్థానానికి వెళ్ళింది.

kannada barc 30

ఇక మలయాళంలో ఎప్పటిలాగానే స్టార్ గ్రూప్ వారి ఏషియానెట్ ఆధిక్యంలో కొనసాగుతూ వస్తోంది. 174315 జివిటిలతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా మళవిల్ మనోరమ 54,753 జివిటిలతో రెండో స్థానం, స్టార్ గ్రూప్ వారి ఏషియానెట్ మూవీస్ 48,640 జివిటిలతో మూడో స్థానం దక్కించుకున్నాయి. దీంతో సన్ గ్రూప్ వారి మలయాళీ చానల్ సూర్య కు మొదటి మూడు రాంకుల్లో స్థానం దక్కనట్టయింది.

Malayalam BARC 30