• Home »
  • Entertainment »
  • జీ కుటుంబం అవార్డులకు ప్రేక్షకుల వోట్లు

జీ కుటుంబం అవార్డులకు ప్రేక్షకుల వోట్లు

తెలుగు టీవీ ప్రేక్షకులు తమ అభిమాన బుల్లితెర నటీనటులకు అవార్డులు ఇప్పించేలా జీ తెలుగు చానల్ మరోవిడత జీ కుటుంబం అవార్డులు ప్రకటించింది. ఈ మధ్యనే పదో వార్షికోత్సవం జరుపుకోవటంతోబాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ చానల్ గా నిలిచిన నేపథ్యంలో ఇప్పుడు ఈ మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

మన ఇంటి పండగ పేరుతో తలపెట్టిన ఈ అవార్డుల కార్యక్రమం కోసం ప్రేక్షకులలు తమ అభిమాన యాంకర్ కు, నటీనటులకు వోటు వేయాల్సి ఉంటుంది. జీ తెలుగు బృందాలు రెండు తెలుగు రాష్టాల్లోని అన్ని ప్రధాన పట్టణాలకూ మొబైల్ వోటింగ్ బూత్ లతో, బాలెట్ బాక్స్ తో వస్తారు. ప్రేక్షకులు అక్కడికక్కడే వోటు వేసే వెసులుబాటు ఉంటుంది. ఆ వోట్ల ఆధారంగా విజేతలను ఎంపికచేసి త్వరలో జరిగే మెగా కార్యక్రమంలో అవార్డులు అందజేస్తారు.

zee kutumbam
ఇప్పటికే హైదరాబాద్ పరిసరాల్లోని తాండూరు, జహీరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాలలో మొబైల్ వాన్ లో తిరిగి వచ్చిన బృందాలు వోటింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. వోటు వేసిన వారిలో కొంతమందికి ఆ కార్యక్రమంలో నేరుగా పాల్గొనేందుకు, అవార్డులిచ్చేందుకు కూడా అవకాశం కల్పిస్తారు.

ప్రేక్షకులు www.zeetelugu.com/zka కు లాగాన్ అయిన మీదట ఆన్ లైన్ లో కూడా వోట్ వేయవచ్చునని జీ తెలుగు ప్రకటించింది.