• Home »
  • Channel Info »
  • మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా జీ తెలుగులో 13 నుంచి ’మహారాణి’

మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా జీ తెలుగులో 13 నుంచి ’మహారాణి’

జీ తెలుగులో జనవరి 13 నుంచి మహారాణి పేరుతో మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ఒక ప్రత్యేక మహిళాకార్యక్రమం ప్రసారం కాబోతున్నది. ప్రతి ఆదివారం రాత్రి 9.30 కి ఈ రియాలిటీ షో కార్యక్రమం ప్రసారమవుతుంది. అభ్యుదయ భావాలతో ముందుకు దూసుకెళుతున్న పది మంది మహిళా సెలెబ్రిటీలు తమ నిజ జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించారో, ఎలా నిజమైన విజేతలుగా నిలిచారో స్వయంగా వివరించే కార్యక్రమం ఇది.

ప్రతి ఎపిసోడ్ లో వీళ్ళు తమ టాస్క్ లను సవాళ్ళుగా తీసుకొని తమ నిర్ణయాలతో ఎలా ముందడుగు వేస్తున్నదీ చూపుతూ చివరికి విజయం సాధించిన తీరు చూడవచ్చు. ఈ టాస్క్ లలో సంస్కృతి, సంప్రదాయం, జీవనశైలి, వినోదం సహా రకరకాల ఆసక్తికరమైన అంశాలుంటాయి. చివర్లో మహారాణి కిరీటం ఎవరికి దక్కిందో ప్రకటిస్తారు.

ఇందులో  హరితేజ, కత్తి కార్తీక, నేహా చౌధురి, మధుప్రియ, నవ్యా రావు. రోహిణి, సునంద, విష్ణుప్రియ, గాయత్రీగుప్త, మంగ్లి పాల్గొంటారు. ఆరంభం ఒక్క అడుగుతోనే అనే చానల్  నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంతోబాటు యువతులు తమ జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళటానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చానల్ నిర్వాహకులు చెబుతున్నారు.