తెలుగులో మరికొన్ని జీ చానల్స్

జీ గ్రూప్ తెలుగులో జీ తెలుగు ప్రారంభించిన పదేళ్ళకు జీ సినిమాలు ప్రారంభించగా త్వరలోనే మరికొన్ని తెలుగు చానల్స్ కూడా ప్రారంభించనున్నట్టు సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకా వెల్లడించారు. దక్షిణాదిన విస్తరించటంలో భాగంగా తెలుగులో అదనపు చానల్స్ పెడుతున్నట్టు చెప్పారు.

నిజానికి ఎప్పుడో మొదలుపెట్టాల్సి ఉన్నప్పటికీ కార్యక్రమాలు సిద్ధం చేసుకోవటం, సినిమా హక్కుల కొనుగోలు వంటి కారణాలవల్లనే కొంత ఆలస్యం జరిగినట్టు కూడా చెప్పారాయన.  తెలుగులోకి విస్తరించటంలోనే మొదట్లో ఆలస్యం జరిగిమ్దని, ఇప్పటికైనా ఆ ఆలస్యాన్ని భర్తీ చేసుకోవాలనుకుంటున్నామని వెల్లడించారు.

ఇప్పటికే హెచ్ డి చానల్ ప్రారంభం కాగా మ్యూజిక్ చానల్ కూడా మొదలు కావచ్చునని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హిందీతో బాటు మరో 11 భాషల్లో జీ టీవీ చానల్స్ ఉండగా మొత్తం173 దేశాల్లో130 కోట్లమంది ప్రేక్షకులు జీ టీవీ చూస్తున్నారు. వచ్చే ఆరేళ్లలో ఈ సంఖ్య 300 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.