• Home »
  • International Channels »
  • అంతర్జాతీయ స్థాయిలో జీ ఇంగ్లీష్ చానల్, సిఎన్ఎన్ తో చర్చలు నిజమే:సుభాష్ చంద్ర

అంతర్జాతీయ స్థాయిలో జీ ఇంగ్లీష్ చానల్, సిఎన్ఎన్ తో చర్చలు నిజమే:సుభాష్ చంద్ర

భారతీయ దృక్పథంతో అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇంగ్లిష్ న్యూస్ చానల్ తీసుకురావాలనుకుంటున్న జీ గ్రూప్ అధిపతి సుభాష్ చంద్ర సి ఎన్ ఎన్ తో చర్చలు ప్రారంభించారు. జీ టీవీలో సి ఎన్ ఎన్ వాటాలు తీసుకుంటుందా అన్న ప్రశ్నకు అయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. భాగస్వామ్యం ఉంటుందని మాత్రమే చెప్పారు. వాటాలు ఇవ్వటానికి తాను వ్యతిరేకం మాత్రం కాదని వెల్లడించారు. కేవలం సి ఎన్ ఎన్ బ్రాండ్ ను వాడుకోవటం వరకే పరిమితం కాదలచుకోలేదన్నారు.

సి ఎన్ ఎన్ తో ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా ఇంగ్లీష్ చానల్ ప్రారంభించటంలో మాత్రం మరో ఆలోచన ఏదీ లేదని సుభాష్ చంద్ర స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చానల్ ప్రారంభిస్తామన్నారు. బిబిసి, అల్ జజీరా, సి ఎన్ ఎన్ తరహాలోనే తమ చానల్ కూడా ఉంటుందని రేఖామాత్రంగా చెప్పారు. కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకోసమే కాదని, భారత దృక్పథాన్ని వివరించటానికే ఈ చానల్ అని చెప్పారు. రాయిటర్స్ లాంటి ఏజెన్సీలు కూడా భారత వైఖరిని మరుగున పరుస్తున్నాయన్నారు.