• Home »
  • Entertainment »
  • ఒడియా చానల్ సార్థక్ టీవీని 115 కోట్లకు కొంటున్న జీ గ్రూప్

ఒడియా చానల్ సార్థక్ టీవీని 115 కోట్లకు కొంటున్న జీ గ్రూప్

ఒడియా జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ సార్థక్ టీవీ ని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. మొత్తం నూరుశాతం వాటాలు కొనుగోలు చేస్తూ 115 కోట్ల రూపాయలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. 2018 వరకు దశలవారీగా మొత్తం నగదు చెల్లించేందుకు జీ ఒప్పుకుంది. అయితే, ఈ లోపు పనితీరు ఆధారంగా ధరలోనూ, చెలింపు వాయిదాల్లోనూ కొద్దిపాటు మార్పులుంటాయని తెలుస్తోంది.

2010 లోప్రారంభమైన సార్థక్ టీవీ ఒడిశా మార్కెట్ లో నెంబర్ వన్ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ గా ఉంది. జీ , గ్రూపులో ఇప్పటికే జీ తెలుగు, జీ కన్నడ, జీ తమిళ్, జీ మరాఠీ, జీ బంగ్లా చానల్స్ సహా మొత్తం 33 చానల్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే  లాభదాయకంగా ఉన్నా ఈ చానల్ కొనుగోలు వలన వ్యాపారం మరింత మెరుగవుతుందని, పైగా తూర్పు తీరం మొత్తం ఉనికిని చాటుకున్నట్టవుతుందని జీ యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం ఒడిశాలో ఉన్న ఇతర జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ తరంగ్ టీవీ, కలర్స్ ఒడిశా మాత్రమే.